Bible Language

Judges 8:10 (AKJV) American King James Version

Versions

TEV   అప్పుడు జెబహును సల్ము న్నాయు వారితోకూడ వారి సేనలును, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన యించు మించు పదునైదు వేలమంది మనుష్యులందరును కర్కోరులో నుండిరి. కత్తి దూయు నూట ఇరువదివేల మంది మనుష్యులు పడిపోయిరి.
ERVTE   జెబహు, సల్మున్నా, వారి సైన్యం కర్కోరు పట్టణంలో ఉన్నారు. వారి సైన్యంలో పదిహేను వేలమంది సైనికులు ఉన్నారు. తూర్పు ప్రాంతపు ప్రజలందరి సైన్యంలో మిగిలిన సైనికులు వీరు. సైన్యంలో లక్షా ఇరవై వేల మంది బలమైన సైనికులు అప్పటికే చంపివేయబడ్డారు.
IRVTE   అప్పుడు జెబహు, సల్మున్నా వాళ్ళతో కూడా వాళ్ళ సైన్యాలు, అంటే తూర్పు ప్రజల సైన్యమంతటిలో మిగిలినవాళ్ళు ఇంచుమించు పదిహేను వేలమంది మాత్రమే, కర్కోరులో ఉన్నారు. లక్షా ఇరవైవేలమంది అప్పటికే చనిపోయారు. PEPS