Bible Language

2 Chronicles 32 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత... అష్షూరురాజైన సన్హెరీబు వచ్చి, యూదాదేశములో చొరబడి ప్రాకారపురములయెదుట దిగి వాటిని లోపరచుకొన జూచెను.
ERVTE   హిజ్కియా పనులన్నీ విశ్వసనీయంగా చేసిన పిమ్మట, అష్షూరు రాజైన సన్హెరీబు యూదా రాజ్యం మీదికి దండెత్తి వచ్చాడు. సన్హెరీబు అతని సైన్యంతో వచ్చి కోటలను మట్టడించి సైనిక స్థావరాలు ఏర్పాటు చేశాడు. అలా చేసి పట్టణాలను తాను జయించాలని అతడు పన్నాగం పన్నాడు. సన్హెరీబు పట్టణాలను తాను స్వయంగా గెలవాలని అనుకున్నాడు.
IRVTE   {సన్హెరీబు యూదాను దండెత్తడం} (32:9-19; 2రాజులు 18:17-35; యెష 36:2-20) (32:20-21; 2రాజులు 19:35-37; యెష 37:36-38) PS హిజ్కియా పనులను నమ్మకంగా జరిగించిన తరువాత, అష్షూరు రాజు సన్హెరీబు యూదా దేశం మీదికి దండెత్తి వచ్చాడు. కోటలూ గోడలూ ఉన్న పట్టణాలను లోపరచుకోడానికి వాటిని చుట్టుముట్టాడు.