Bible Language

2 Samuel 4:4 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలునుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానమువచ్చి నప్పుడు వాడు అయిదేండ్లవాడు; వాని దాది వానిని ఎత్తికొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెతు.
ERVTE   సౌలు కుమారుడైన యోనాతానుకు కుంటివాడైన ఒక కుమారుడున్నాడు. యెజ్రెయేలు వద్ద సౌలు, అతని కుమారుడు యోనాతాను చనిపోయారన్న వార్త వచ్చే సమయానికి యోనాతాను కుమారుడు ఐదేండ్లవాడు. అప్పుడా పిల్లవాని దాది వాని నెత్తుకొని పారి పోయినది. ఖంగారుగా పారిపోయేటప్పుడు, దాది చేతులలో నుండి యోనాతాను కుమారుడు జారికిందపడ్డాడు. అందువల్ల యోనాతాను కుమారుడు కుంటివాడయ్యాడు. వీని పేరు మెఫీబోషెతు.
IRVTE   సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడైన ఒక కొడుకు ఉన్నాడు. యెజ్రెయేలు నుండి సౌలు గురించీ యోనాతాను గురించీ సమాచారం వచ్చినప్పుడు అతడు ఐదేళ్ళ బాలుడు. అతని ఆయా అతణ్ణి ఎత్తుకుని వేగంగా పరుగెత్తినప్పుడు అతడు కింద పడిపోయి కుంటివాడయ్యాడు. అతడి పేరు మెఫీబోషెతు. PEPS