Bible Language

Isaiah 65:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నిశ్చయముగా మీ దోషములనుబట్టియు మీ పితరుల దోషములనుబట్టియు అనగా పర్వతములమీద జనులు ధూపమువేసిన దానినిబట్టియు కొండలమీద నన్ను దూషించినదానినిబట్టియు మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతికారము కొలిచి పోయుదును.
ERVTE   “మీ పాపాలు, మీ తండ్రుల పాపాలు అన్నీ ఒకటే.” యెహోవా ఇలా చెప్పాడు, “మీ తండ్రులు పర్వతాల్లో ధూపం వేసినప్పుడు పాపాలు చేశారు. కొండల మీద వారు నన్ను అవమానించారు. మరియు నేను మొదట వాళ్లను శిక్షించాను. వారు పొందాల్సిన శిక్ష నేను వారికి ఇచ్చాను.”
IRVTE   వాళ్ళ పాపాలకూ వాళ్ళ పూర్వీకుల పాపాలకూ వారిని శిక్షిస్తాను.
పర్వతాలమీద ప్రజలు ధూపం వేసిన దాన్ని బట్టి, కొండలపై నన్ను దూషించిన దాన్ని బట్టి,
మునుపు చేసిన పనులకు కూడా వారి ఒడిలోనే వారికి ప్రతీకారం కొలిచి పోస్తాను.”