Bible Language

Jeremiah 31:18 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన యెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చు చుండగా నేను ఇప్పుడే వినుచున్నాను.
ERVTE   ఎఫ్రాయిము విలపిస్తున్నట్లు నేను విన్నాను. ఎఫ్రాయిము ఇలా అంటూవుండగా నేను విన్నాను: ‘యెహోవా, నీవు నిజంగా నన్ను శిక్షించావు! నేను మంచి గుణపాఠం నేర్చుకున్నాను. నేనిక ఎన్నడూ తర్భీతు పొందని కోడెదూడలా ఉన్నాను. దయచేసి నన్ను శిక్షించటం మానివేయుము. నేను తిరిగి నీ యొద్దకు వస్తాను. నీవే నిజమైన నా యెహోవా దేవుడవు.
IRVTE   “నేను కచ్చితంగా ఎఫ్రాయిము దుఃఖించడం విన్నాను, ‘నువ్వు నన్ను శిక్షించావు, నేను శిక్షకు లోనయ్యాను. కాడి మోసే శిక్షణలేని దూడలా ఉన్న నన్ను మళ్ళీ తీసుకురా, అప్పుడు నేను వస్తాను. నువ్వు నా దేవుడవైన యెహోవావు.