Versions
TEV బబులోనురాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారముక్రిందనున్న భూరాజ్యములన్నియు జనములన్నియు కూడి యెరూషలేముమీదను దాని పురము లన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్దనుండి యిర్మీయాకు దర్శనమైన వాక్కు.
ERVTE యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముతోను, దాని చుట్టు పట్ల నున్న పట్టణాలతోను యుద్ధం చేసే సమయంలో ఈ వర్తమానం వచ్చింది. నెబుకద్నెజరు పాలన కింద ఉన్న మహా సామ్రాజ్యంలోని దేశాల, సామంతుల సైన్యంతో పాటు తన సైన్యం యావత్తూ నెబుకద్నెజరుతో యెరూషలేమును ముట్టడించుటకు కదలి వచ్చింది.
IRVTE {సిద్కియాకు హెచ్చరిక} PS బబులోను రాజైన నెబుకద్నెజరు, అతని సైన్యం అంతా, అతని అధికారం కింద ఉన్న భూరాజ్యాలు, ప్రజలు, అందరూ కలిసి యెరూషలేము మీద, దాని ప్రాంతాలన్నిటి మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా అన్నాడు.