Bible Language

Isaiah 36:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా నేను వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోదును; యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చు చున్నాడు.
ERVTE   నేను వచ్చి, మీ స్వంత దేశంలాంటి దేశానికి మిమ్మల్ని ఒక్కొక్కరిని తీసుకొని వెళ్లేంత వరకు మీరు ఇలా చేయవచ్చు. కొత్త దేశంలోమీకు మంచి ధాన్యం, కొత్త ద్రాక్షరసం ఉంటాయి. దేశంలో భోజనం, ద్రాక్షవనాలు ఉంటాయి.”
IRVTE   తరవాత నేను వచ్చి మీ దేశంలాంటి దేశానికి, అంటే గోదుమలు, ద్రాక్షరసం దొరికే దేశానికి, ఆహారం, ద్రాక్షచెట్లు ఉన్న దేశానికి మిమ్మల్ని తీసుకుపోతాను. యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పి హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు.