Versions
TEV ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మముకంటె పల్లము కాక యుండినయెడల, యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును.
ERVTE ఏడవ రోజున యాజకుడు ఆ పొడను పరిశీలించాలి. ఆ పొడ చర్మంలోనికి విస్తరించక, అది చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడకపోయినా, ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుకుకొని శుద్ధుడు కావాలి.
IRVTE ఏడో రోజు యాజకుడు ఆ మచ్చ వ్యాపించిందేమో చూడాలి. ఆ మచ్చ కేవలం చర్మం పైన మాత్రమే కనిపిస్తూ ఉంటే యాజకుడు అతణ్ణి శుద్ధుడిగా నిర్థారించాలి. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. తరువాత అతడు శుద్ధుడు అవుతాడు. PEPS