Bible Language

Numbers 33:54 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను.
ERVTE   మీ కుటుంబాలు ప్రతి ఒక్కదానికీ దేశంలో భాగం ఉంటుంది. దేశంలోని ఒక్కోభాగం కుటుంబానికి వస్తుందో తెలుసు కొనేందుకు మీరు చీట్లు వేయాలి. పెద్ద కుటుంబాలకు దేశంలో పెద్ద భాగం ఇవ్వవలెను. చిన్న కుటుంబాలకు దేశంలో చిన్న భాగం ఇవ్వవలెను. చీట్లు చేసిన నిర్ణయం ప్రకారమే ప్రజలకు భూమి ఇవ్వబడుతుంది. ప్రతి వంశానికి తమ వంతు భూమి ఇవ్వబడుతుంది.
IRVTE   మీరు మీ వంశాల ప్రకారం చీట్లు వేసి దేశాన్ని వారసత్వంగా పంచుకోవాలి. ఎక్కువ మందికి ఎక్కువ, తక్కువ మందికి తక్కువ వారసత్వం ఇవ్వాలి. చీటీ ప్రకారం ఎవరికి స్థలం వస్తుందో స్థలమే అతడు తీసుకోవాలి. మీ తండ్రుల గోత్రాల ప్రకారం మీరు వారసత్వం పొందాలి.