Versions
TEV యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగినవారలారా, యూదా జలములలోనుండి బయలుదేరి వచ్చినవారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతిసత్యములను అనుసరింపనివారలారా, ఈ మాట ఆలకించుడి.
ERVTE యెహోవా చెబతున్నాడు: “యాకోబు వంశమా, నా మాట విను! మిమ్మల్ని మీరు ‘ఇశ్రాయేలు’ అని చెప్పుకొంటారు. మీరు యూదా వంశస్థులు. ప్రమాణాలు చేయటానికి మీరు యెహోవా నామం ప్రయోగిస్తారు. ఇశ్రాయేలు దేవుణ్ణి మీరు స్తుతిస్తారు. కానీ ఈ సంగతులను మీరు చేస్తున్నప్పుడు మీరు నమ్మకంగా ఉండరు.”
IRVTE {ఇశ్రాయేలు తలబిరుసుతనం} PS యూదా సంతానమా! యాకోబు వంశమా! ఈ మాట విను.
నిన్ను ఇశ్రాయేలు అనే పేరుతో పిలుస్తున్నారు.
నువ్వు యెహోవా నామం తోడని ప్రమాణం చేస్తావు.
ఇశ్రాయేలు దేవుని పేరు స్మరిస్తావు.
అయితే యథార్థంగా నిజాయితీతో అలా చేయవు.