Bible Language

1 Kings 20:42 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   అప్పుడు అతడుయెహోవా సెలవిచ్చునదేమనగానేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలోనుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులును అప్పగింప బడుదురని రాజుతో అనగా
ERVTE   ప్రవక్త యెహోవా వర్తమానాన్ని రాజుకిలా చెప్పాడు: “చంపబడాలని నేను నిర్దేశించిన వ్యక్తిని నీవు వదిలి పెట్టావు. కావున వాని స్థానంలో నీ ప్రాణం తీసుకోబడుతుంది. అతని ప్రజల స్థానంలో నీ ప్రజలు చనిపోవలసి వుంటుంది.”
IRVTE   ప్రవక్త రాజుతో “యెహోవా చెప్పేదేమిటంటే, నేను చంపేయమన్న వాణ్ణి నీవు వెళ్లిపోనిచ్చావు. కాబట్టి వాడి ప్రాణానికి బదులు నీ ప్రాణం ఇవ్వాలి. అతని ప్రజలకు బదులు నీ ప్రజలు నిర్మూలమవుతారు” అన్నాడు.