Bible Language

2 Kings 25 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   అతని యేలుబడిలో తొమి్మదవ సంవత్సరమందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టును ముట్టడి దిబ్బలు కట్టిరి.
ERVTE   సిద్కియా తిరుగుబాటు చేసి బబులోను రాజుకు విధేయుడై వుండటానికి సమ్మతించలేదు. అందువల్ల, బబులోను రాజైన నెబుకద్నెజరు అతని మొత్తము సైన్యము యెరూషలేముకు ప్రతికూలముగా యుద్ధము చేయడానికి వచ్చింది. సిద్కియా రాజు యొక్క తొమ్మిదో సంవత్సరాన, 10వ నెలలో 10వ రోజున ఇది సంభవించింది. నెబుకద్నెజరు తన సైన్యాన్ని యెరూషలేము చుట్టు ఉంచి, ప్రజలను నగరం నుండి వెలుపలికిగాని లోపలికిగాని రానీయకుండ చేశాడు. తర్వాత నగరం చుట్టు అతను ఒక మురికి గోడ నిర్మించాడు.
IRVTE   {యెరూషలేము విధ్వంసం} (25:1-12; యిర్మీ 39:1-10) (25:1-21; 2దిన 36:17-20; యిర్మీ 52:4-27) PS సిద్కియా పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో పదో నెల, పదో రోజు బబులోను రాజు నెబుకద్నెజరు, అతని సైన్యం, యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా శిబిరాల్లో నివాసం చేసి, దాని చుట్టూ ముట్టడి దిబ్బలు కట్టారు.