Bible Language

Jeremiah 32:24 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   ముట్టడి దిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి, ఖడ్గము క్షామము తెగులు వచ్చుటవలన దానిమీద యుద్ధముచేయుచుండు కల్దీయుల చేతికి పట్టణము అప్పగింపబడును; నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దాని చూచుచున్నావు గదా?
ERVTE   “మరియు ఇప్పుడు శత్రువులు నగరాన్ని చుట్టు ముట్టారు. యెరూషలేము నగర ప్రాకారం చుట్టూ దిమ్మలు, మెట్లు నిర్మిస్తున్నారు. తద్వారా వారు నగరపు గోడలు సులభంగా ఎక్కి నగరాన్ని పట్టుకోవాలని చూస్తున్నారు. శత్రువుల కత్తుల మూలంగా కరువులు, రోగాలు మొదలైన ఈతి బాధల కారణంగా, కల్దీయుల సైన్యం యోరూషలేము నగరాన్ని ఓడిస్తుంది. ఇప్పుడు బబులోను సైన్యం నగరాన్ని ఎదుర్కొంటూ వుంది! యెహోవా, ఇది జరుగుతుందని నీవు చెప్పావు. పైగా అది నీవు చూస్తూ వుండగానే జరుగుతూ ఉంది.
IRVTE   చూడు! పట్టణాన్ని స్వాధీనం చేసుకోడానికి ముట్టడి దిబ్బలు పైపైకి లేస్తున్నాయి. ఖడ్గం, కరువు, తెగులు రావడం వల్ల దాని మీద యుద్ధం చేసే కల్దీయుల చేతికి పట్టణం అప్పగించడం జరిగింది. నువ్వు ఏం చెప్పావో అది జరుగుతూ ఉంది. జరుగుతున్నది నువ్వు చూస్తున్నావు.