Bible Language

Leviticus 13:3 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   యాజకుడు వాని దేహచర్మమందున్న పొడను చూడగా పొడ యందలి వెండ్రుకలు తెల్లబారినయెడలను, పొడ అతని దేహచర్మము కంటె పల్లముగా కనబడినయెడలను అది కుష్ఠు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను.
ERVTE   వ్యక్తి చర్మంమీది మచ్చను యాజకుడు పరిశీలించాలి. మచ్చలోని వెంట్రుకలు తెల్లబడినా, మచ్చ అతని చర్మంకంటె లోతుకు ఉన్నా అది కుష్ఠురోగమే. యాజకుడు వ్యక్తిని పరిశీలించటం ముగించగానే వ్యక్తి కుష్ఠురోగి అని యాజకుడు ప్రకటించాలి.
IRVTE   అప్పుడు యాజకుడు అతని చర్మంపై ఉన్న వ్యాధిని పరీక్ష చేస్తాడు. వ్యాధి మచ్చ ఉన్న ప్రాంతంపైన వెంట్రుకలు తెల్లగా మారి, మచ్చ చర్మంలో లోతుగా ఉన్నట్టు కన్పిస్తే అది అంటువ్యాధి. యాజకుడు అతణ్ణి పరీక్ష చేసిన తరువాత అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి.