Bible Language

Micah 2 (KJV) King James Version

Versions

TEV   మంచములమీద పరుండి మోసపు క్రియలు యోచిం చుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ; ఆలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు.
ERVTE   పాపం చేయటానికి ఉపాయం పన్నేవారికి ఆపదలు వస్తాయి. ప్రజలు తమ పాన్పులపై పడుకొని పాపం చేయటానికి పథకాలు వేస్తారు. తెల్లవారగానే, ప్రజలు తమ పథకం ప్రకారం చెడు పనులు చేస్తారు. ఎందుకంటే వాటిని చేయటానికి వారికి శక్తిఉంది.
IRVTE   {ధనికుల దుర్మార్గాలు} PS మంచాల మీద పడుకుని మోసపు పనులు ఆలోచిస్తూ
దుర్మార్గాలు చేసేవారికి బాధ తప్పదు.
వాళ్లకు అధికారముంది
కాబట్టి పగటి వెలుతురులో వాళ్ళు అలా చేస్తారు.