Bible Language

2 Kings 19:25 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతనకాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నావలననే సంభవించినది.
ERVTE   దేశము మీదుగా నడిచాను” అదే నీవు చెప్పింది, కాని నీవు దేవుడు చెప్పింది వినలేదా? “నేను (దేవుడు) పూర్వమే పథకము వేశాను ప్రాచీన కాలం నుండి పథకం వేశాను ఇప్పుడది జరుగునట్లు చేశాను బలిష్ఠమైన నగరాలు నాశనము చేయుటకును రాతి కుప్పలుగా మార్చుటకును నిన్ను అనుమతించాను.
IRVTE   నేనే పూర్వకాలంలోనే దీన్ని కలగచేశాననీ, పురాతన కాలంలోనే దీన్ని నిర్ణయించాననీ నీకు వినబడలేదా? ప్రాకారాలున్న పట్టణాలను నీవు పాడు దిబ్బలుగా చెయ్యడం నావల్లే జరిగింది.