Bible Language

Jeremiah 26:18 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   యూదారాజైన హిజ్కియా దినములలో మోర ష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెనుసైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుచేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.
ERVTE   “ప్రవక్తయైన మీకా మోరష్తీ నగర వాసి. యూదా రాజైన హిజ్కియా పాలనా కాలంలో మీకా ప్రవక్తగా వున్నాడు. యూదా ప్రజలందరికీ మీకా విషయాలు చెప్పియున్నాడు: “సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పినదేమంటే: సీయోను దున్నబడిన పొలంలా అవుతుంది! యెరూషలేము ఒక రాళ్ల గుట్టలా తయారవుతుంది! గుడివున్న పర్వతం, ఒక ఖాళీ కొండ పొదలతో నిండినట్లవుతుంది.
IRVTE   “యూదా రాజు హిజ్కియా రోజుల్లో మోరషు ఊరివాడు మీకా ప్రవచిస్తూ ఉండేవాడు. అతడు యూదా ప్రజలందరితో ఇలా చెప్పాడు. సేనల అధిపతి యెహోవా చెప్పేదేమిటంటే, సీయోనును పొలంలాగా దున్నడం జరుగుతుంది. యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది. మందిరమున్న పర్వతం అరణ్యంలోని కొండలాగా అవుతుంది.