Versions
TEV కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్లకుప్పవలె చేసెదను, ద్రాక్షచెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచెదను, దాని పునాదులు బయలుపడునట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను;
ERVTE మైదానంలో రాళ్ల గుట్టలా నేను సమరయను మార్చుతాను. అది ద్రాక్షాతోట వేయటానికి అనువైన భూమివలె మారిపోతుంది. సమరయ యొక్క నిర్మాణపు రాళ్లను పెరిగి లోయలో పారవేస్తాను. నేను దాని పునాదులను నాశనం చేస్తాను.