Bible Language

Malachi 4 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును;గర్విష్ఠులందరును దుర్మార్గు లందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ERVTE   “తీర్పు సమయం వస్తుంది. అది కాలుతున్న అగ్ని గుండంలా ఉంటుంది. గర్విష్ఠులు అందరూ శిక్షించబడతారు. దుర్మార్గులు అందరూ గడ్డిలా కాలిపోతారు. సమయంలో వారు అగ్నిలో మండుతున్న ఒక పొదలా ఉంటారు - దాని కొమ్మగాని వేరుగాని మిగలదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా విషయాలు చెప్పాడు.
IRVTE   {రాబోయే యెహోవా దినం} PS సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు. “నియమిత దినం రాబోతుంది. అది కాలుతూ ఉన్న కొలిమిలాగా ఉంటుంది. గర్విష్ఠులంతా, దుర్మార్గులంతా ఎండుగడ్డిలాగా ఉంటారు. వారిలో ఒక్కరికి కూడా వేరు గానీ, చిగురు గానీ ఉండదు. రాబోయే దినాన అందరూ తగలబడి పోతారు.