Bible Language

Jeremiah 6:10 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   విందురని నేనెవరితో మాటలాడెదను? ఎవరికి సాక్ష్య మిచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు.
ERVTE   నేనెవరితో మాట్లాడగలను?ఎవరిని హెచ్చరించగలను? నా మాట ఎవరు వింటారు? ఇశ్రాయేలు ప్రజలు నా హెచ్చరికలు వినపడకుండా తమ చెవులు మూసుకున్నారు. యెహోవా ఉపదేశములు వారికిష్టము లేదు. కావున నా హెచ్చరికలు వారు వినలేరు. యెహోవా యొక్క బోధనలను ప్రజలు సహించరు. యెహోవా మాటలను వినుటకు వారు ఇష్టపడరు.
IRVTE   నేనెవరితో మాట్లాడి హెచ్చరించాలి? వారు వినడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వినలేదు.
ఇదిగో, యెహోవా వాక్యం వారిని సరిదిద్దడానికి వారి దగ్గరికి వచ్చింది కానీ దాన్ని వారు తృణీకరిస్తారు.