Bible Language

Daniel 8:7 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   నేను చూడగా ఆమేకపోతు పొట్టేలును కలిసికొని, మిక్కిలి రౌద్రముగలదై దానిమీదికి వచ్చి పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను. పొట్టేలు దాని నెదిరింపలేక పోయినందున మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను; దాని బలమును అణచి పొట్టేలును తప్పించుట ఎవరిచేతను కాకపోయెను.
ERVTE   మేకపోతు పొట్టేలువైపు పరుగెత్తి చాలా కోపంతో కలబడి పొట్టేలు రెండు కొమ్ముల్ని విరుగ కొట్టింది. మేకపోతును పొట్టేలు ఎదిరించలేకపోయింది. మేకపోతు పొట్టేలుని నేలకు పడవేసి దాన్ని త్రొక్కివేసింది. మేకపోతు నుండి పొట్టేలుని కాపాడగలిగిన వారెవ్వరూ లేకపోయిరి.
IRVTE   నేను చూస్తుండగా మేకపోతు పొట్టేలుపై తిరగబడి, భీకరమైన రౌద్రంతో దాని మీదికి వచ్చి పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను విరగ్గొట్టింది. పొట్టేలు దాని నెదిరించలేక పోయింది. మేకపోతు దాన్ని నేలపై పడేసి తొక్కుతూ ఉంది. దాని బలాన్ని అదుపు చేసి పొట్టేలును తప్పించడం ఎవరివల్లా కాలేదు. PEPS