Bible Language

2 Kings 7:12 (RV) Revised Version

Versions

TEV   రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచిసిరియనులు మనకు చేసినదానిని నేను మీకు చూపింతును; మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసియున్నది గనుకవారు పట్టణములోనుండి బయటకు వచ్చినయెడల మనము వారిని సజీవులనుగా పట్టు కొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచనచేసి, పేట విడిచి పొలములోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను.
ERVTE   అది రాత్రిగడియ. అప్పుడు రాజు పడక నుండి లేచాడు. తన అధికారులతో రాజు, “సిరియా సైనికులు మనకేమి చేస్తున్నారో మీకు చెప్తాను. మనము ఆకలిగా వున్నామని వారికి తెలుసు. పొలాలలో దాగుకొనడానికి వారు విడిదిని విడిచిపెట్టి వెళ్లారు. నగరం వెలుపలికి ఇశ్రాయేలువారు రాగానే, వారిని సజీవంగా మనము పట్టుకోవచ్చు, తర్వాత మనం నగరం ప్రవేశిద్దాము అని వారనుకొంటున్నారు” అని చెప్పాడు.
IRVTE   అప్పుడు రాజు రాత్రి వేళ లేచి తన సేవకులను పిలిచాడు. వాళ్ళతో “ఇప్పుడు సిరియా వారు మనకేం చేశారో చెప్తాను చూడండి. మనం ఆకలితో నకనకలాడుతున్నామని వాళ్ళకు తెలుసు. వారు ‘వీళ్ళు పట్టణంలో నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళను సజీవంగా పట్టుకుని మనం పట్టణంలో ప్రవేశిద్దాం’ అని చెప్పుకుని శిబిరం విడిచి బయటకు వెళ్ళి దాక్కున్నారు” అన్నాడు.