Bible Language

Amos 8:10 (RV) Revised Version

Versions

TEV   మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును.
ERVTE   మీ పండుగ దినాలను చనిపోయిన వారి కొరకు దుఃఖించే దినాలుగామార్చుతాను. మీ పాటలన్నీ మృతులకొరకు విలాప గీతాలవుతాయి. ప్రతివాని పైన విషాద సూచిక దుస్తులు వేస్తాను. ప్రతివాని తలను బోడితల చేస్తాను. ఏకైక పుత్రుడు చనిపోయినప్పుడు కలిగే గొప్ప దుఃఖంలాంటి దుఃఖాన్ని నేను కలిగిస్తాను. అది ఒక భయంకరమైన అంతం.”
IRVTE   మీ పండగలను దుఃఖదినాలుగా
మీ పాటలన్నిటినీ విషాద గీతాలుగా మారుస్తాను.
మీరంతా గోనెపట్ట కట్టుకొనేలా చేస్తాను.
మీ అందరి తలలు బోడిచేస్తాను.
ఒక్కడే కొడుకు చనిపోతే శోకించినట్టుగా నేను చేస్తాను.
దాని ముగింపు ఘోరమైన రోజుగా ఉంటుంది. PEPS