Bible Language

Jeremiah 17:25 (RV) Revised Version

Versions

TEV   దావీదు సింహాసనమందు ఆసీనులై, రథముల మీదను గుఱ్ఱములమీదను ఎక్కి తిరుగుచుండు రాజులును అధిపతులును పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులును యూదావారును యెరూష లేము నివాసులును పట్టణపు గుమ్మములలో ప్రవేశిం తురు; మరియు పట్టణము నిత్యము నిలుచును.
ERVTE   “మీరీ ఆజ్ఞను పాటిస్తే, దావీదు సింహాసనంపై కూర్చునే రాజులంతా యెరూషలేము నగర ద్వారం గుండా వస్తారు. రాజులు రధాలమీద, గుర్రాల మీద ఎక్కి వస్తారు. రాజుల వెంట యూదా, యెరూషలేము ప్రజానాయకులు కూడా వుంటారు. యెరూషలేము నగరంలో శాశ్వతంగా ప్రజలు నివసిస్తారు.
IRVTE   అప్పుడు దావీదు సింహాసనమెక్కే రాజులూ అధిపతులూ నగర ద్వారాలగుండా ప్రవేశిస్తారు. రథాల మీదా గుర్రాల మీదా ఎక్కి తిరిగే రాజులూ అధిపతులూ యూదావారూ యెరూషలేము నివాసులూ వస్తారు. పట్టణం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.