Bible Language

Jeremiah 30:10 (RV) Revised Version

Versions

TEV   మరియు యెహోవా సెలవిచ్చునదే మనగానా సేవకుడవైన యాకోబూ, భయపడకుము; ఇశ్రాయేలూ, విస్మయమొందకుము,నేను దూరముననుండు నిన్నును, చెర లోనికి పోయిన దేశముననుండు నీ సంతానపువారిని రక్షించుచున్నాను; బెదరించువాడు లేకుండ యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును.
ERVTE   “కావున నా సేవకుడవైన యాకోబూ, నీవు భయపడవద్దు!” ఇదే యెహవా వాక్కు: “ఇశ్రాయేలూ, భయపడవద్దు! సుదూర దేశంనుండి నిన్ను నేను రక్షిస్తాను. దూర దేశంలో మీరు బందీలైవున్నారు. మీ సంతతివారిని భూమినుండి తిరిగి తీసుకొస్తాను. యాకోబుకు తిరిగి శాంతి సమకూరుతుంది. ప్రజలు యాకోబును బాధ పెట్టరు. నా ప్రజలను భయపెట్టుటకు ఇక శత్రువులుండరు.
IRVTE   కాబట్టి, నా సేవకుడవైన యాకోబూ, భయపడకు, యెహోవా చేప్పేదేమంటే, ‘ఇశ్రాయేలూ, దిగులు పడకు. దూరంగా ఉన్న నిన్ను, బందీలుగా దేశంలో ఉన్న నీ సంతతి వాళ్ళను, నేను రక్షించబోతున్నాను. యాకోబు సంతతి తిరిగి వచ్చి, శాంతి కలిగి ఉంటుంది. అతడు సురక్షితంగా ఉంటాడు, భయభీతులు ఇంక ఉండవు.