Bible Language

2 Samuel 15:2 (WEB) World English Bible

Versions

TEV   ఉదయముననే లేచి బయలుదేరి పట్టణముయొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి, రాజుచేత తీర్పునొందుటకై వ్యాజ్యెమాడు వారెవరైనను వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచినీవు ఊరివాడవని యడుగుచుండెనునీ దాసుడనైన నేను ఇశ్రాయేలీయుల గోత్రములలో ఫలానిదానికి చేరిన వాడనని వాడు చెప్పగా
ERVTE   అబ్షాలోము ఉదయం పెందలకడలేచి నగర ద్వారం వద్ద నిలబడేవాడు. అక్కడికి ఎవరైనా ఏదైనా సమస్యపై న్యాయం కోరుతూ దావీదు రాజు కొరకు వస్తే, అబ్షాలోము వారిని పిలిచేవాడు. వారిని “ఏ నగరం నుండి వచ్చినారని” అడిగేవాడు. “ఇశ్రాయేలు వంశాలలో ఒకడినని” వచ్చినవాడు చెప్పేవాడు.
IRVTE   పొద్దున్నే లేచి బయలుదేరి పట్టణ ద్వార గుమ్మం దారి దగ్గర ఒకవైపున కూర్చుని ఉండేవాడు. తమ వివాదాల పరిష్కారం కోసం తీర్పుల కోసం రాజు దగ్గర వచ్చే ప్రజలను కనిపెట్టి వారిని పిలిచేవాడు. వారిని “నువ్వు ఊరివాడివి?” అని క్షేమ సమాచారాలు తెలుసుకొనేవాడు. “నీ దాసుడనైన నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఫలానా గోత్రానికి చెందినవాణ్ణి” అని వాడు చెప్పినప్పుడు,