Bible Language

Isaiah 51:13 (WEB) World English Bible

Versions

TEV   బాధపెట్టువాడు నాశనము చేయుటకుసిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?
ERVTE   యెహోవా మిమ్మల్ని చేశాడు. తన శక్తితో ఆయన భూమిని చేశాడు. తన శక్తితో ఆకాశాలను భూమికి పైగా ఆయన విస్తరింపజేసాడు. కానీ ఆయనను, ఆయన శక్తిని మీరు మరచి పోతారు. కనుక మీకు హాని చేసే కోపిష్ఠులైన మనుష్యులను గూర్చి ఎల్లప్పుడు మీరు భయపడుతుంటారు. మనుష్యులు మిమ్మును నాశనం చేయాలను పథకం వేసారు. కానీ ఇప్పుడు వాళ్లెక్కడ? వాళ్లంతా పోయారు.
IRVTE   ఆకాశాలను పరచి భూమి పునాదులు వేసిన మీ సృష్టికర్త అయిన యెహోవాను ఎందుకు మరచిపోతున్నారు?
బాధించేవాడు ఎంతో కోపంతో మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి
మీరు ప్రతిరోజూ నిరంతర భయంతో ఉన్నారు. బాధించేవాడి కోపం ఏమయింది?