Bible Language

Jeremiah 29:21 (WEB) World English Bible

Versions

TEV   నా నామమునుబట్టి మీకు అబద్ధప్రవచనములు ప్రక టించు కోలాయా కుమారుడైన అహాబును గూర్చియు, మయశేయా కుమారుడైన సిద్కియాను గూర్చియు, ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
ERVTE   సర్వశక్తిమంతుడైన యెహోవా కోలాయా కుమారుడైన అహాబును గురించి, మయశేయా కుమారుడైన సిద్కియాను గురించి ఇలా చెపుతున్నాడు: “ఈ ఇద్దరు మనుష్యులు మీకు అబద్దాలు బోధిస్తున్నారు. వారు చెప్పే సందేశం నానుండి వచ్చినదేనని అంటున్నారు. కాని వారు అబద్ధమాడుతున్నారు. ఇద్దరు ప్రవక్తలను బబులోను రాజైన నెబుకద్నెజరు అప్పగిస్తారు. అప్పుడు నెబుకద్నెజలుకు బబులోనులో బందీలుగా వున్న మీ అందరి ముందు ప్రవక్తలను చంపుతాడు.
IRVTE   నా పేరును బట్టి మీకు అబద్ధ ప్రవచనాలు ప్రకటించే కోలాయా కొడుకు అహాబు గురించి, మయశేయా కొడుకు సిద్కియా గురించి, ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, చూడండి, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వాళ్ళను అప్పగించబోతున్నాను. మీ కళ్ళ ఎదుట అతడు వాళ్ళను చంపుతాడు. PEPS