Versions
TEV యెహోవా మహా ఘనత నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను.
ERVTE యెహోవా ఎంతో గొప్పవాడు. ఆయన మహాఉన్నత స్థలంలో ఉంటాడు. సీయోనును న్యాయంతో, మంచితనంతో యెహోవా నింపుతాడు.
IRVTE యెహోవా మహా ప్రశంస పొందాడు. ఆయన ఉన్నత స్థలంలో నివసిస్తున్నాడు. ఆయన సీయోనును నీతితో, న్యాయంతో నింపుతాడు.