Versions
TEV ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఈలాగు చెప్పబడును అరణ్యమందు చెట్లులేని మెట్టలమీదనుండి వడగాలి నా జనుల కుమార్తెతట్టు విసరుచున్నది; అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు.
ERVTE అ సమయంలో యూదా, యోరూషలేము ప్రజలకు ఒక వర్తమానం ఇవ్వబడుతుంది: “వట్టి కొండలపై నుండి వేడిగాలి వీస్తుంది. అది ఎడారి నుండి నీ ప్రజల మీదికి వీస్తుంది. అది రైతులు నూర్చిన ధాన్యం పోతపోయటానికి పనికి వచ్చే పైరుగాలిలాంటిది కాదు.
IRVTE ఆ రోజుల్లో ఆ ప్రజలకు యెరూషలేము నివాసుల గూర్చి ఇలా చెబుతారు. “ఎడారిలో చెట్లులేని మెరకల నుండి నా ప్రజల పైకి వడగాలి వీస్తున్నది. అది తూర్పార పట్టడానికో, శుద్ధి చేయడానికో కాదు.