Versions
TEV మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము.
ERVTE నీ పాపాలు ఒక పెద్ద మేఘంలా ఉండేవి. కాని ఆ పాపాలను నేను తుడిచి వేశాను. గాలిలో అదృశ్యమైన ఒక మేఘంలా నీ పాపాలు పోయాయి. నేను నిన్ను తప్పించి కాపాడాను, కనుక తిరిగి నా దగ్గరకు వచ్చేయి.”
IRVTE మంచు విడిపోయేలా నేను నీ అతిక్రమాలను, మేఘాలు తొలగిపోయేలా నీ పాపాలను తుడిచివేశాను. నేను నిన్ను విమోచించాను. నా దగ్గరికి తిరిగి రా.