Versions
TEV దేవుడు సొదొమ గొమొఱ్ణాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనముచేయగా మీరు మంటలోనుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించు కొంటిరి; అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.
ERVTE సొదొమ, గొమొర్రా నగరాలను నేను నాశనం చేసినట్లు నేను నిన్ను నాశనం చేశాను. ఆ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పొయ్యిలో నుండి లాగబడి కాలిన కట్టెలా మీరున్నారు. కాని మీరు సహాయంకొరకు నా వద్దకు రాలేదు.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
IRVTE దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్టు
నేను మీలో కొంతమందిని నాశనం చేశాను.
మీరు మంటలోనుంచి లాగేసిన కట్టెల్లాగా తప్పించుకున్నారు.
అయినా మీరు నా వైపు తిరగలేదు.
యెహోవా ప్రకటించేది ఇదే. PEPS