Versions
TEV దానీ యుల సరిహద్దు వారియొద్దనుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరునుబట్టి ఆ లెషెమునకు దానను పేరు పెట్టిరి.
ERVTE అయితే దాను ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోవటంలో కష్టం వచ్చింది. అక్కడ బలమైన శత్రువులు ఉన్నారు, వారిని దాను ప్రజలు తేలికగా ఓడించలేకపోయారు. కనుక దాను ప్రజలు వెళ్లి లెషెము మీద యుద్ధం చేసారు. లెషెమును వారు ఓడించి, అక్కడ నివసించిన మనుష్యులను చంపివేసారు. కనుక దాను ప్రజలు లెషెము పట్టణంలో నివసించారు. దాని పేరును వారు దానుగా మార్చి వేసారు, ఎందుకంటే అది ఆ వంశం పితరుని పేరు.
IRVTE దాను గోత్రం వారి భూభాగం ఈ సరిహద్దుల నుండి అవతలకు వ్యాపించింది. దాను గోత్రంవారు బయలుదేరి లెషెము మీద యుద్ధం చేసి దాన్ని జయించి కత్తితో దాని నివాసులను చంపి దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించి తమ పూర్వీకుడు దాను పేరుతో లెషెముకు దాను అనే పేరు పెట్టారు.