Versions
TEV మరియు అవి నీ యిండ్లలోను నీ సేవకులందరి యిండ్లలోను ఐగుప్తీయులందరి యిండ్లలోను నిండిపోవును. నీ పితరులుగాని నీ పితామహులుగాని యీ దేశములో నుండిన నాటనుండి నేటివరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో యెదుట నుండి బయలు వెళ్లెను.
ERVTE మీ ఇండ్లు మీ అధికారుల ఇండ్లు, ఈజిప్టులో ఉన్న మొత్తం ఇండ్లన్నీ మిడతలతో నిండిపోతాయి. మీ తల్లిదండ్రులు, తాతలు ఎన్నడైనా చూచిన వాటికంటే ఎక్కువ మిడతలు ఉంటాయి. ఈజిప్టులో మనుష్యులు నివాసం మొదలు పెట్టినప్పటినుండి ఎన్నడైనా ఉన్న మిడతల కంటె ఎక్కువ మిడతలు ఉంటాయి.” తరువాత మోషే ఫరోను విడిచి, వెనుదిరిగాడు.
IRVTE మీ గృహాలూ మీ సేవకుల గృహాలూ ఐగుప్తీయుల ఇళ్ళన్నీ వాటితో నిండిపోతాయి. మీ తండ్రులు, పూర్వికులు ఈ దేశంలో ఉన్నప్పటి నుండి ఈనాటి వరకూ ఇలాంటి వాటిని చూసి ఉండలేదు” అని చెప్పి ఫరో దగ్గర నుండి వెళ్ళిపోయారు. PEPS