Versions
TEV వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమ పడువారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను.
ERVTE ఆ ప్రదేశాలలో ప్రజలు స్తుతిగీతాలు ఆలపిస్తారు. ఉల్లాసమైన నవ్వుల కిలకిలలు వినిపిస్తాయి. వారి సంతానం అభివృద్ధి అయ్యేలా చేస్తాను. ఇశ్రాయేలు, యూదా అల్ప రాజ్యాలుగా ఉండవు. వాటికి కీర్తి ప్రతిష్ఠలు కలుగజేస్తాను. ఎవ్వరూ వారిని చిన్నచూపు చూడరు.
IRVTE అప్పుడు వాటిలోనుంచి ఒక స్తుతి కీర్తన, ఒక వేడుక శబ్దం బయటకు వస్తుంది. ప్రజలు తక్కువ సంఖ్యలో లేకుండా నేను వాళ్ళను విస్తరింపజేస్తాను. అల్పులు కాకుండా నేను వాళ్ళకు ఘనత కలుగజేస్తాను.