Versions
TEV ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలను వాడును వాని దిసమొలను ఆమెయు చూచిన యెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానా చ్ఛాదనమును తీసెను; తన దోష శిక్షను తాను భరించును.
ERVTE “ఒక సోదరుడు అతని సోదరి అనగా తండ్రి కుమార్తెగాని, తల్లి కుమార్తెగాని ఒకరితో ఒకరు లైంగిక సంబంధం పెట్టుకోవటం చాలా సిగ్గుచేటు. వాళ్లను బహిరంగంగా శిక్షించాలి. వాళ్ల ప్రజల్లోనుంచి వాళ్లను వేరు చేయాలి. తన సోదరితో లైంగిక సంబంధం పెట్టుకొన్న మగవాడు అతని పాపం నిమిత్తం శిక్షపొందాలి.”
IRVTE ఒకడు తన సోదరితో, అంటే తన తండ్రి కుమార్తెతో గానీ తన తల్లి కుమార్తెతో గానీ లైంగిక సంబంధం పెట్టుకుంటే అది సిగ్గుచేటు. తమ జాతి వారి సమక్షంలో వారిని ప్రజల్లో లేకుండా చెయ్యాలి. వాడు తన సోదరితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. తన దోష శిక్షను తాను భరించాలి. PEPS