Versions
TEV ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరము గాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను, అది పట్టకుండ తప్పించుకొనుటకైనను, ఏ జంతువునకును శక్తిలేకపోయెను; అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను.
ERVTE ఆ కొమ్ములతో పొట్టేలు పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి పరుగెత్తడం చూశాను. ఏ మృగమూ పొట్టేలుని ఎదురించలేక పోయింది. మరియు ఎవ్వరూ దీనినుండి ఇతర జంతువుల్ని కాపాడలేక పోయారు. ఆ పొట్టేలు చేయదలచిందంతా చేస్తూంది. అందువల్ల పొట్టేలు చాలా శక్తివంత మయింది.
IRVTE ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమానికి, ఉత్తరానికి, దక్షిణానికి, పరుగులు పెడుతూ ఉండడం కనిపించింది. ఇలా జరుగుతుండగా దాన్ని ఎదిరించడానికైనా, దానికి చిక్కకుండా తప్పించుకోడానికైనా, ఏ జంతువుకూ శక్తి లేకపోయింది. అది తనకిష్టమైనట్టు చేస్తూ గొప్పదయింది. PEPS