Versions
TEV శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది
ERVTE “యెహోవా నన్ను ఎంతో ఎంతో సంతోషింపజేస్తాడు. నా దేవునియందు నేను సంపూర్ణంగా సంతోషిస్తున్నాను. రక్షణ వస్త్రాలతో యెహోవా నన్ను కప్పాడు. ఆ వస్త్రాలు ఒకడు తన పెండ్లికి ధరించే వస్త్రాల్లా ఉన్నాయి. దయ అనే పైబట్టతో యెహోవా నన్ను కప్పాడు. ఈ పైబట్ట ఒక స్త్రీ తన పెండ్లికి ధరించే అందమైన వస్త్రాల్లా ఉంది.