Versions
TEV నీవు నాశనము చేయబడువరకు ఈ శాపము లన్నియు నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టు కొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞా పించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు.
ERVTE “ఈ శాపాలన్నీ మీ మీదికి వస్తాయి. మీరు నాశనం అయ్యేంతవరకు అవి మిమ్మల్ని తరుముతూ, పట్టుకొంటూనే ఉంటాయి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీకు చెప్పిన వాటిని మీరు వినలేదు. ఆయన మకు ఇచ్చిన ఆదేశాలకు, ఆజ్ఞలకు మీరు విధేయులు కాలేదు.
IRVTE మీరు నాశనమయ్యేవరకూ ఈ శిక్షలన్నీ మీ మీదికి వచ్చి మిమ్మల్ని తరిమి పట్టుకుంటాయి. ఎందుకంటే మీ యెహోవా దేవుడు మీకాజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలనూ, ఆయన చట్టాలనూ అనుసరించి నడుచుకొనేలా మీరు ఆయన మాట వినలేదు.