Versions
TEV అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూష లేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహో యాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి.
ERVTE యోషీయా అధికారులు అతని దేహాన్ని రథము మీద వుంచి మెగిద్డోనుంచి యెరూషలేము వరకు మోసుకుపోయారు. వారు యోషీయాను అతని సమాధిలో సమాధి చేశారు. తర్వాత సామాన్యులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును అభిషేకించారు. వారు యెహోయాహాజును తమ కొత్త రాజుగా చేసు కున్నారు.
IRVTE అతని సేవకులు అతని శవాన్ని రథం మీద ఉంచి, మెగిద్దో నుంచి యెరూషలేముకు తీసుకొచ్చి, అతని సమాధిలో పాతిపెట్టారు. అప్పుడు దేశ ప్రజలు యోషీయా కొడుకు యెహోయాహాజుకు పట్టాభిషేకం చేసి, అతని తండ్రి స్థానంలో అతన్ని రాజుగా చేశారు. PEPS