Versions
TEV అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చి వేసెను.
ERVTE ఎలీషా వెనుదిరిగి ఆ బాలురను చూశాడు. వారి పట్ల చెడు విషయాలు జరగాలని అతను యెహోవాని అర్థించాడు. తర్వత అడవినుండి రెండు ఎలుగు బంట్లు వెలుపలికి వచ్చి ఆ బాలురను ఎదిరించాయి. ఆ ఎలుగుబంట్లు ఆ నలభై రెండు మంది పిల్లలను చీల్చివేశాయి.