Versions
TEV యెహోవా ఖడ్గము రక్తమయమగును అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము చేతను పొట్లేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్ప బడును ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును.
ERVTE ఎందుకంటే, బొస్రాలో, ఎదోములో చంపబడే సమయం ఒకటి ఉండాలని యెహోవా నిర్ణయించాడు గనుక.
IRVTE యెహోవా ఖడ్గం రక్తమయమవుతుంది. అది కొవ్వుతో కప్పి ఉంటుంది. గొర్రెపిల్లల, మేకల రక్తం చేతా, పొట్లేళ్ల మూత్రపిండాల మీది కొవ్వు చేతా కప్పి ఉంటుంది.
ఎందుకంటే బొస్రా నగరంలో యెహోవా బలి జరిగిస్తాడు. ఎదోము దేశంలో గొప్ప వధ చేస్తాడు.