Versions
TEV నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.
ERVTE ఎందుకంటే నిన్ను చేసిన వాడు నీ భర్త (దేవుడు) గనుక ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా. ఇశ్రాయేలును రక్షించేవాడు ఆయనే. ఆయన ఇశ్రాయేలు పరిశుద్ధుడు. ఆయన సర్వభూమికి దేవుడు అని పిలువ బడతాడు.