Versions
TEV పేళ్లవరుసను వ్రాయబడియుండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడినవారి గుడారములను నివాసస్థలములను పడగొట్టి వారిని హతముచేసి, అచ్చట తమ గొఱ్ఱలకు తగిన మేత కలిగియుండుటచేత నేటివరకు వారి స్థానములను ఆక్రమించుకొని యున్నారు.
ERVTE యూదా రాజు హిజ్కియా కాలంలో ఇది జరిగింది. ఆ మనుష్యులంతా గెదోరుకు వచ్చి, హామీయులతో పోరాడి, వారి గుడారాలన్నిటినీ నాశనం చేశారు. వారింకా అక్కడ నివసించే మెయోనీయులతో కూడ యుద్ధం చేసి వారిని నాశనం చేసారు. ఈనాటి వరకు అక్కడ మెయోనీయులు లేరు. తరువాత ఈ మనుష్యులే అక్కడ నివసించసాగారు. అక్కడ వారి గొర్రెలకు పుష్కలంగా మేత దొరకడంతో వారక్కడ స్థిరపడ్డారు.