Versions
TEV ఆ యధి పతియెహోవా ఆకాశమందు కిటి కీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడునీవు కన్నులార చూచెదవుగాని దానిని తినకపోదువని ఆ యధిపతితో చెప్పెను.
ERVTE కాని ఆ ఉద్యోగి దేవుని వ్యక్తికి చెప్పిన సమాధాన మేమిటంటేః “యెహోవా పరలోకపు కిటికిలు తెరచినా, ఇలా జరగదు” అని. ఎలీషా ఆ ఉద్యోగితో ఇలా చెప్పివుండెను. “నీవు నీ కళ్లతోనే చూడగలవు, కాని నీవు ఆ ఆహారమేమీ భుజింపవు.” 20ఆ విధంగానే, ఆ ఉద్యోగికి జరిగింది. ప్రజలు ద్వారం దగ్గర అతనిని కిందికి తోసి, అతని మీదగా నడిచారు. అతను మరణించాడు.
IRVTE అప్పుడు ఆ అధికారి “చూడండి, యెహోవా పరలోకం కిటికీలు తెరిచినా అలాంటిది జరుగుతుందా?” అని ప్రశ్నించాడు. దానికి దేవుని మనిషి “చూస్తూ ఉండు. అలాగే జరగడం నీవు నీ కళ్ళారా చూస్తావు. కానీ దాంట్లో దేన్నీ తినవు” అని జవాబిచ్చాడు.