Versions
TEV నీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటు చేయుచు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము; ఇదే యెహోవా వాక్కు.
ERVTE నీవు నీ పాపాన్ని గుర్తించాలి. నీ యెహోవా దేవునికి నీవు వ్యతిరేకమయ్యావు నీ పాపం అదే. ఇతర దేశాలనుండి వచ్చిన వారి విగ్రహాలను నీవు ఆరాధించినావు నీవు ప్రతి పచ్చని చెట్టు కిందా విగ్రహారాధన చేశావు నీవు నా ఆజ్ఞను మన్నించలేదు.”‘ ఇదే యోహోవా వాక్కు.