Versions
TEV ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్ఠార్పణలకును ప్రథమ ఫలములకును పదియవవంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదులమీద కొందరు నియమింపబడిరి, వారు యాజకుల కొరకును లేవీయులకొరకును ధర్మశాస్త్రాను సారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలములనుండి సమకూర్చుటకు నియమింపబడిరి; సేవ చేయుటకు నియమింపబడిన యాజకులనుబట్టియు, లేవీయు లనుబట్టియు యూదులు సంతోషించిరి.
ERVTE ఆ రోజున వస్తుపులను భద్రపరచు గదులలో భద్రపరచు కొందరిని నియమించారు. జనం తమ తొలికాపు ఫలాలను, పదోవంతు పంటలను తీసుకు వచ్చారు. వస్తువులను భద్రపరచువారు వాటిని వస్తువులను భద్రపరచు గదులలో పదిలపరిచారు. బాధ్యులుగా వున్న యాజకుల, లేవీయుల విషయంలో యూదా జనసామాన్యం చాలా తృప్తి చెందారు. అందుకని, వాళ్లు గిడ్డంగుల్లో పెట్టేందుకు చాలా వస్తువులు తెచ్చారు.
IRVTE ఆ కాలంలో పదార్థాలను, ప్రతిష్టిత వస్తువులను, ప్రథమ ఫలాలను, దశమ భాగాలను ఉంచే గిడ్డంగులను కాపలా కాయడానికి కొందర్ని నియమించారు. యాజకుల, లేవీయుల కోసం, ధర్మశాస్త్రం ప్రకారం నిర్ణయించిన భాగాలను పట్టణాల నుండి, పొలాల నుండి సమకూర్చడానికి వీరిని నియమించారు. పరిచర్య చేయడానికి యాజకులు, లేవీయులను నియమించగా యూదులు సంతోషించారు. PEPS