Versions
TEV నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామ మునుబట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టు కొనుచున్నాను.
ERVTE కానీ నేను ఓపిగ్గా ఉంటాను. నా కోసమే నేను ఇలా చేస్తాను. నేను కోపగించి మిమ్మల్ని నాశనం చేయనందుకు ప్రజలు నన్ను స్తుతిస్తారు. సహించినందుకు మీరూ నన్ను స్తుతిస్తారు.
IRVTE నా నామం కోసం నేను నిన్ను నిర్మూలం చేయను. నా కోపం చూపించను.
నా కీర్తి కోసం మిమ్మల్ని నాశనం చేయకుండా నీ విషయంలో నన్ను నేను తమాయించుకుంటాను.