Versions
TEV నీదుర్మార్గము వెల్లడి చేయబడకముందు నీవు గర్వించి యున్నప్పుడు నీ చెల్లెలగు సొదొమ ప్రస్తావమెత్తక పోతివి.
ERVTE నీవు శిక్షింపబడక ముందు, నీ పొరుగువారు నిన్ను చూచి నవ్వక ముందు నీవది చేశావు. ఎదోము (అరాము) కుమార్తెలు (పట్టణాలు), మరియు ఫిలిష్తీయులు ఇప్పుడు నిన్ను చూచి నవ్వుతున్నారు.
IRVTE నీ దుర్మార్గం బయట పడక ముందు, నువ్వు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలు సొదొమ ప్రస్తావన నువ్వు తీసుకురాలేదు.