Versions
TEV వాడు రక్తమును ఒలికించిన వాడు; ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకునియొద్దకు ప్రత్యక్షపు గుడా రముయొక్క ద్వారమునకే తీసికొని వచ్చి సమాధాన బలిగా అర్పించునట్లు ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టి వేయబడవలెను.
ERVTE ప్రజలు వారి సమాధాన బలిని యెహోవాకు అర్పించేందుకే ఈ నియమం. ఇశ్రాయేలు ప్రజలు పొలాల్లో చంపే జంతువులను కూడా తీసుకొని రావాలి. ఆ జంతువులను సన్నిధి గుడార ద్వారం దగ్గర వారు యెహోవాకు అర్పించాలి. ఆ జంతువులను వారు యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి.
IRVTE ఈ ఆదేశం వెనుక ఉన్న ఉద్దేశం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఇక పైన బలి అర్పించాలంటే బలి పశువులను ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవాకి శాంతిబలి అర్పణ చేయడానికి యాజకుని దగ్గరికి తీసుకురావాలి.